బాలయ్యకు మరో అరుదైన గౌరవం..!

బాలయ్యకు మరో అరుదైన గౌరవం..!

Published on Nov 27, 2026 1:00 AM IST

2025 జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. నవంబర్ 26, 2026న విడుదల చేసిన జీఓ ప్రకారం అవార్డుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్ ఎస్. గోపాల్ రెడ్డి, నటి ప్రభ సభ్యులుగా నియమితులయ్యారు.

​తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాలకు చెందిన అనుభవజ్ఞులను ఈ సెలక్షన్ ప్యానెల్‌లో భాగస్వాములను చేయడం విశేషం. నటన, నిర్మాణం, సినిమాటోగ్రఫీ రంగాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వీరి నేతృత్వంలో అవార్డుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.

తాజా వార్తలు