‘విరూపాక్ష’ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. టీజర్, ట్రైలర్లలో కనిపించిన కాన్సెప్ట్, విజువల్స్, సాంకేతిక విలువలు, హీరో-విలన్ పాత్రలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. గతంలో ‘కుమారి 21ఎఫ్’, ‘విరూపాక్ష’ చిత్రాల తరహాలోనే ఈ సినిమా కథ కూడా సుకుమార్‌కు నచ్చడంతో, ఆయన స్క్రీన్ ప్లేతో పాటు మేకింగ్, ఎడిటింగ్, ట్రైలర్ కట్లలోనూ కీలకంగా వ్యవహరించినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
సుకుమార్ పర్యవేక్షణ, మార్గదర్శకత్వం ఈ సినిమా క్వాలిటీకి ప్రధాన కారణమనే చర్చ సినిమా వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ వినిపిస్తుండగా, ట్రైలర్ తర్వాత ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రెట్టింపైంది. డిసెంబర్ 4న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి, నాగచైతన్య కెరీర్లోనే పెద్ద హిట్‌గా నిలుస్తుందని అంచనాలు నెలకొన్నాయి; మరి తన గురువు సాయంతో కార్తీక్ దండు ఎలాంటి ఫలితాన్ని అందిస్తాడో వేచి చూడాలి.


