ఈ ఏడాది హిందీ సినిమా నుంచి వచ్చి ఊహించని లాభాలు అందించిన సినిమానే ‘హనుమాన్ అంశ్’. మేకర్స్ కేవలం 2 కోట్ల బడ్జెట్ పెడితే ఈ సినిమా ఏకంగా 450 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకొని కాసుల పంట పండించింది. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ పార్ట్ 1 సినిమాలో హీరోగా శోభినవ్ సత్య నటించగా డాక్టర్ విశాల్ చతుర్వేది తెరకెక్కించారు.
ఆగష్టు 7న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా దాదాపు రెండు నెలల మేర లాంగ్ రన్ ని థియేటర్స్ లో చూసింది. ఫైనల్ గా ఆగష్టు నుంచి ఎట్టకేలకి థియేటర్స్ లో నుంచి ఓటిటి లోకి వచ్చేసింది. అయితే నేటి నుంచి కేవలం ఈ సినిమా హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి చూడొచ్చు. ఒరిజినల్ ని చూడాలి అనుకునేవారు ఇందులో ట్రై చేయవచ్చు. తెలుగు సహా ఇతర డబ్బింగ్ భాషల్లో చూడాలి అనుకుంటే కొంచెం ఆగాల్సిందే.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


