కుమారుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

కుమారుడి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Published on Aug 31, 2014 5:45 PM IST

balakrishna
ఎన్టీఆర్ నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న వంటి మూడవ తరం వారసులు ఎంట్రీ ఇచ్చారు. అయినా ప్రస్తుతం నందమూరి అభిమానుల అంతా బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినీరంగ ప్రవేశం చేస్తారని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఇంకా చాలా సమయం ఉందని తాజాగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోక్షజ్ఞకు సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. అమెరికాలో బి.బి.ఎం చదువుతున్నాడు. మరో రెండేళ్ళ తర్వాత హీరోగా పరిచయం చేయాలనీ భావిస్తున్నాం. వాడి మీద నాకు చాలా ఆశలున్నాయి. అని అన్నారు బాలకృష్ణ. ఇంకా మాట్లాడుతూ… మోక్షజ్ఞ కోసం కథలు వినడం లేదని స్పష్టం చేశారు. ఇంకా చాలా సమయం ఉంది. నా 100వ సినిమా గురించి ఇంకా ఆలోచించడం లేదు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడు జరుగుతుంది అని అన్నారు.

తాజా వార్తలు