కోవిడ్ బాధితులకు బాలకృష్ణ భారీ సహాయం

Published on May 13, 2021 11:00 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే తమ కుటుంబానికి చెందిన ట్రస్ట్ ద్వారా అనేక రకాల వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయన కోవిడ్ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలో కరోనాతో కష్టాలు పడుతున్న ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.

సొంత నిధులతో సుమారు 20 లక్షలు విలువ చేసే కరోనా మందుల కిట్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ నుండి హిందూపూర్ పంపించారు. స్థానిక నాయకులు వాటిని అందుకుని కరోనా బాధితులకు పంపిణీ చేశారు. కోవిడ్ లక్షణాలతో బాధపడే ఎవరైనా సరే ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే ఉచితంగా మందులను అందించాలని తన బృందానికి తెలిపారు బాలకృష్ణ. ఇప్పటికే పలువురు బాలయ్య సహాయాన్ని అందుకోగా అవసమైతే మరిన్ని ముందులు పంపడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :