బాలకృష్ణ ‘డిక్టేటర్’ రిలీజ్ డేట్

బాలకృష్ణ ‘డిక్టేటర్’ రిలీజ్ డేట్

Published on Aug 16, 2015 1:53 PM IST

balakrishna
ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలను, తెలుగుదనానికి పెద్ద పీటవేసే తనకు కథ నచ్చితే కొత్త వారికి కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ ముందుండే హీరో నందమూరి బాలకృష్ణ. బాలయ్య హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్’. తన కెరీర్లోనే పూర్తి డిఫరెంట్ గా ఉండేలా ట్రై చెయ్యాలనుకున్న బాలకృష్ణ ఈ సినిమా కోసం టాలీవుడ్ క్రేజీ టీంని ఒకటి చేసాడు. వారే శ్రీవాస్ – కోన వెంకట్ – గోపీమోహన్. వీరంతా కలిసి బాలయ్య ఇమేజ్ కి సరిపోయే అంశాలను పొందు పరుస్తూనే ఓ డిఫరెంట్ కథని తయారు చేసారు. జూలై 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అందులో భాగంగా మొదటగా నానక్రామ్ గూడాలో వేసిన ఓ స్పెషల్ హౌస్ సెట్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. గత 20 రోజులుగా కొన్ని సీన్స్ తీయడంలో బిజీగా ఉన్న ఈ చిత్ర టీం ప్రస్తుతం బాలకృష్ణపై వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ ని షూట్ చేసే పనిలో ఉన్నారు.

శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకానున్న ఈ సినిమా కోసం ఈ చిత్ర టీం రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది. తాజాగా ఈ చిత్ర మెయిన్ టీం తెలిపిన సమాచారం ప్రకారం 2016 సంక్రాంతి బరిలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించారు. ఎక్కువ భాగం జనవరి 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా చేయనున్నారు. బాలకృష్ణ ఈ సినిమా కోసం 12 కేజీల బరువు తగ్గి చాలా స్లిమ్ అవ్వడమే కాకుండా మునుపెన్నడూ కనిపించని స్టైలిష్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీవాస్ డైరెక్టర్. కోన వెంకట్ – గోపి మోహన్ – ఎం.రత్నం – శ్రీధర్ సీపాన కలిసి కథ- డైలాగ్స్ని అందించిన ఈ సినిమాని శ్రీవాస్ ఇరోస్ వారితో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు, ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా ఉండేలా కథని రెడీ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు