విజేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులు ఎవరో తెలుసా !

విజేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధులు ఎవరో తెలుసా !

Published on Jun 22, 2018 7:45 PM IST

మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి చిత్రం విజేత . ఈ ఆదివారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను గ్రాండ్ గా జరుపనున్నారు ఇక ఈ వేడుకకి ముఖ్య అతిధులుగా ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు వస్తున్నారు . వారిలో హీరో కళ్యాణ్ దేవ్ మావయ్య చిరంజీవి తోపాటు , నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ వేడుకకి హాజరవుతున్నారు ఇక ఇటీవల విడుదలైనఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టింది.

రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తండ్రి , కొడుకుల మధ్య సాగె కథ నేపథ్యంలో తెరకెక్కింది . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్ర పతాకం ఫై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం జులై లో ప్రేక్షకుల ముందుకు రానుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు