‘లెజెండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి బాలకృష్ణ మరోసారి ప్రజానాయకుడిగా చేస్తున్న సినిమా ‘గాడ్సే'(వర్కింగ్ టైటిల్). లెజెండ్ లో లానే బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లోని రింగ్ రోడ్ లో షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ బైక్ పై వస్తుండగా వచ్చే ఓ చేజ్ సీక్వెన్స్ మరియు కొన్ని కార్ బ్లాస్టింగ్ సీన్స్ ని నిన్న షూట్ చేసారు.
ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కి కొద్ది రోజుల ముందు బాలకృష్ణ – త్రిషలపై కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఈ సినిమా ద్వారా సత్యదేవ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత.


