‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?

‘డ్రాగన్’లో గోవిందా.. నిజమేనా ?

Published on Apr 6, 2026 9:03 PM IST

JrNTR-Neel

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా (వర్కింగ్ టైటిల్ డ్రాగన్) పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో ప్రత్యేక పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారట. పైగా ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ మెంటర్ పాత్రలో గోవిందా కనిపిస్తాడని టాక్. ఇక వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట.

పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అనిల్ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

తాజా వార్తలు