బాలకృష్ణకు హీరోయిన్ల సమస్య మళ్లీ మొదలైందా ?

Published on Jun 2, 2021 2:09 am IST

మన సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత చాన్నాళ్ల నుండి ఉంది. దాదాపు సీనియర్ హీరోయిన్లు అందరితోనూ సినిమాలు చేసిన మన సీనియర్ స్టార్లకు కొత్త జోడీలు దొరకట్లేదు. వీళ్లు ఏ కొత్త సినిమా మొదలుపెట్టినా ఇదే మొదటి, పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ మొదలుపెట్టనున్న కొత్త చిత్రానికి ఇదే ప్రాబ్లమ్ అయింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’ పూర్తికాగానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నారు.

ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెట్టిన గోపిచంద్ హీరోయిన్లను ఫైనల్ చేసే పని పెట్టుకున్నారు. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ముందుగా గోపిచంద్ శృతి హాసన్ ను అప్రోచ్ అవ్వగా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ను కూడ సంప్రదించారు. అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అవి కూడ పెద్ద ప్రాజెక్ట్స్ కావడంతో డేట్స్ ఖాళీ లేక బాలయ్య సినిమా అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. దీంతో గోపిచంద్ మలినేని మళ్లీ కొత్త హీరోయిన్లను అప్రోచ్ అయ్యే పనిలో పడ్డారట. మరి చివరకు బాలయ్యకు జోడీగా ఎవరు ఫైనల్ అవుతాతో చూడాలి.

సంబంధిత సమాచారం :