భీష్ముడిగా బాలయ్య.. గెటప్ అయితే అదుర్స్

Published on Feb 23, 2021 5:42 pm IST

పౌరాణిక చిత్రాలన్నా, ఇతిహాసాల్లోని పాత్రలన్నా నందమూరి బాలకృష్ణగారికి ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవకాశం వస్తే ఎప్పుడైనా సరే పౌరాణిక పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయన. ఈరోజు భీష్మ ఏకాదశి కావడంతో బాలయ్య భీష్ముడి గెటప్లో ఉన్న తన ఫోటోలను రివీల్ చేశారు. ఇంతకీ ఈ గెటప్ ఏ సినిమాలోది అనుకుంటున్నారా.. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలోనిదే. తన తండ్రి నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారంగా ఈ సినిమా చేశారు బాలకృష్ణ.

ఇందులో ఆనాడు ఎన్టీఆర్ చేసిన భీష్ముడి పాత్ర వేషధారణలో కొన్ని సన్నివేశాలు చేశారు. కానీ సినిమా లెంగ్త్ పెద్దది కావడం మూలాన వాటిని సినిమా నుండి తొలగించారు. ఆ ఫోటోలనే బాలయ్య ఈరోజు రివీల్ చేశారు. భీష్ముడి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ పాత్రలో తన తండ్రి ఎన్టీఆర్ ప్రదర్శించిన నటన నాడు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుందని, అందుకే ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను షూట్ చేశామని కానీ లెంగ్త్ పెగడం వలన ఫైనల్ కట్ నుండి వాటిని తొలగించామని ఈరోజు భీష్మ ఏకాదశి సందర్బంగా వాటిని ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం :