‘రానే వచ్చాడయ్య ఆ రామయ్య’గా రానున్న బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.?

‘రానే వచ్చాడయ్య ఆ రామయ్య’గా రానున్న బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ.?

Published on Oct 3, 2014 11:47 PM IST

mokshagna-sai-korapati

నందమూరి బాలకృష్ణ కెరీర్లో మెయిలు రాయిగా నిలిచిపోయే ‘లెజెండ్’ సినిమా తీసిన నిర్మాత సాయి కొర్రపాటి. లెజెండ్ సినిమా నుంచి సాయి కొర్రపాటికి బాలకృష్ణతో అనుబంధం మరింత బలపడింది. ఆ అనుబంధం వల్లనే సాయి కొర్రపాటి నిర్మించిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాని బాలయ్య ప్రత్యేకంగా చూసి టేస్టున్న నిర్మాతని అభినందించారు.

ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే.. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏమిటంటే సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై ‘రానే వచ్చాడయ్య ఆ రామయ్య’ అనే టైటిల్ ని బుక్ చేసారు. ఈ విషయం గురించి విచారిస్తే నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేసే సినిమా కోసం ఈ టైటిల్ రిజిస్టర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఇది విన్న అందరూ సాయి కొర్రపాటికి బాలకృష్ణతో మంచి రిలేషన్ ఉంది కావున తన కొడుకు మోక్షజ్ఞ ని పరిచయం చేసే చాన్స్ ఇస్తాడని అంటున్నారు.

వారాహి చలన చిత్రం బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సాయి కొర్రపాటి కొత్త కథలని, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు . మరి ఈ సినిమాతో ఎవరినన్నా కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తాడా.? లేక సీనియర్ డైరెక్టర్ తో చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా వార్తలు