బాలయ్య భారీ పారితోషికం నిజమేనా ?

Published on Oct 13, 2019 8:27 pm IST


నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తోన్న 105వ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి బాలయ్య పది కోట్ల భారీ పారితోషికం తీసుకున్నాడని గతరెండు రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కావని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మొదట్లో ‘రూలర్’ అనే టైటిల్ నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ అదే కన్ఫర్మ్ అనుకున్నారు.

కానీ ఇప్పుడు కొత్త టైటిల్ తెర మీదికి వచ్చింది. ఆ టైటిలే ‘జడ్జిమెంట్’. టైటిల్ సాఫ్ట్ గా ఉన్నప్పటికీ కథలో బాలయ్య పాత్రకు తగిన టైటిల్ ఇదేనని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ టైటిల్ నిజమేనా..? అధికారిక ప్రకటన వస్తే గాని నమ్మలేం. ఇక `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు.

కాగా ఇటీవ‌ల విడుద‌లైన బాలయ్య పోస్టర్ లుక్‌ కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. మొత్తానికి బాలయ్య లుక్స్ అండ్ గెటప్స్ తోనే సినిమా పై అంచనాలు పెంచేశాడు. ఇక ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More