బాలయ్య రిస్క్ తీసుకుంటున్నారా ?

Published on May 5, 2021 3:00 am IST

కోవిడ్ కారణంగా అన్ని పెద్ద సినిమాలకు బ్రేకులు పడ్డాయి. చిరు, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ ఇంకా పెద్ద హీరోలంతా సినిమాలను పక్కన పెట్టేశారు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని గ్యాప్ ఇచ్చారు. కాస్త ధైర్యం చేసి ముందుకెళ్లిన అల్లు అర్జున్ కోవిడ్ బారినపడటం కూడ జరిగింది. నందమూరి బాలకృష్ణ చిత్రం ‘అఖండ’కు ఆగింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్నప్పటికీ పరిస్థితి అంచనా వేసి బ్రేక్ ఇచ్చారు. కానీ మళ్లీ చిత్రీకరణ మొదలుపెట్టే యోచనలో ఉన్నారట బాలయ్య.

ఈ నెల 13 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అనుకున్న సమయం కంటే కొద్దిగా ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ మిస్సవుతుందేమోనని పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నా కూడ రిస్క్ చేసి షూటింగ్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో టాకీ పార్ట్ కొంత ముగియనుంది. అతి తక్కువ మంది సభ్యులతో, అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ జరపనున్నారు. బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్ షెడ్యూల్లో పాల్గొననుంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రేడ్ వర్గాల్లో సైతం బాలయ్య గత చిత్రాలకు వేటికీ లేని హైప్ ఈ సినిమాకు దక్కడం విశేషం.

సంబంధిత సమాచారం :