సంక్రాంతి వార్.. బాలయ్య వర్సెస్ చిరు మరోసారి!

సంక్రాంతి వార్.. బాలయ్య వర్సెస్ చిరు మరోసారి!

Published on May 10, 2025 2:00 AM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బడా సినిమాలు పోటీ పడటం కామన్. అయితే, బడా హీరోల సినిమాలు పోటీ పడుతుండటం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేస్తుంది. తమ హీరో సినిమానే పై చేయి చూపించాలని అభిమానులు కోరుతుంటారు. ఇదే పరంపర పలు దశాబ్దాలుగా కొనసాగుతుంది.

అయితే, ఈసారి కూడా ఓ పండుగ సీజన్‌ను ఇద్దరు సీనియర్ హీరోలు కైవసం చేసుకునేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అనిల్ రావిపూడి మూవీని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబో కూడా ఈ బరిలో రానున్నట్లు తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండు సినిమాలు నిజంగానే బాక్సాఫీస్ దగ్గర పోటీ పడతాయి అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు