
డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కి టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇప్పటి వరకూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ కంపోజ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క హీరో చేత సిగ్నేచర్ స్టెప్స్ వేయించి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ప్రేమ్ రక్షిత్ నందమూరి నటసింహం బాలకృష్ణ చేత స్టెప్స్ వేయిస్తున్నాడు .
బాలకృష్ణ నటిస్తున్న ‘లయన్’ సినిమా సాంగ్ షూట్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కుటుంబ నేపధ్యంలో వచ్చే ఈ పాటలో ప్రముఖ తారాగణం అంతా కలిసి స్టెప్స్ వేస్తున్నారు. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ తో లయన్ షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ఓడలైన ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
సత్యదేవ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలకృష్ణ సరసన త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి రుద్రపతి రమణరావు నిర్మాత.

