మోక్షజ్ఞ సినిమాకు బాలయ్యే డైరెక్టర్ !

Published on Jun 11, 2021 3:01 am IST

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ అంతా బాలయ్య వారసుడి కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మోక్షజ్ఞకు సినిమాలంటే అస్సలు ఆసక్తి లేదని, వ్యాపారాలు చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలొచ్చాయి. దీంతో అభిమానుల్లో కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు నందమూరి కాంపౌండ్లో సమీకరణాలు మారాయట. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

బాలయ్య కెరీర్లో మరుపురాని చిత్రం ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫాంటసీ టైమ్ ట్రావెల్ చిత్రం యొక్క సీక్వెల్ తోనే మోక్షజ్ఞ హీరోగా మారుతున్నారట. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా డైరెక్ట్ చేయనున్నారట. అంతేకాదు కుమారుడితో కలిసి నటిస్తారట కూడ. సో..మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా అభిమానులకు బోలెడన్ని సర్ప్రైజెస్ ఇవ్వనుందన్నమాట. ఇకపోతే ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారు, రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :