అఫీషియల్ : బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ మేనకోడలు

అఫీషియల్ : బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ మేనకోడలు

Published on Aug 25, 2014 10:59 AM IST

balakrishna-and-radhika-apte

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 98వ సినిమాలో సెకండ్ హీరోయిన్’గా రాధికా ఆప్టేను ఎంపిక చేసినట్టు యూనిట్ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. ‘లెజెండ్’ సినిమాలో బాలకృష్ణ మేనకోడలుగా రాధికా ఆప్టే నటించింది. ఆమె నటనకు మంచి పేరొచ్చింది. ‘లెజెండ్’ తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రాధికా.

సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న బాలయ్య 98వ సినిమాలో త్రిష ఒక హీరోయిన్ గా నటిస్తుంది. రాధిక ఆప్టే మరొక హీరోయిన్. ఇద్దరు హీరోయిన్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ‘లెజెండ్’లో రాధిక నటన చూసి ఈ సినిమాకు ఎంపిక చేశాం. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటిస్తుంది. అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇటివల షూటింగ్లో గాయపడడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న బాలయ్య తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు