బాలయ్య కూడ ఆపేద్దాం అనుకుంటున్నారా ?

Published on Apr 21, 2021 11:00 pm IST

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఇండస్ట్రీ నెమ్మదిస్తోంది. సినిమా షూటింగ్లు ఆగిపోతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ మొదలుకావట్లేదు. విడుదలలు వాయిదా పడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, వెంకటేష్ లాంటి చాలామంది స్టార్ హీరోల షూటింగ్స్ ఆగిపోయాయి. నటీనటులు, టెక్నీకల్ టీమ్ చాలామంది వైరస్ బారినపడుతున్నారు. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న సినిమాలను కూడ త్వరలో నిలిపివేయాలనే ఆలోచనలో ఉన్నారు చాలామంది హీరోలు. వారిలో నందమూరి బాలకృష్ణ కూడ ఉన్నట్టు తెలుస్తోంది.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ చిత్రం చేస్తున్నారు. గత లాక్ డౌన్ వలన ఆలస్యమైన ఈ చిత్రాన్ని శరవేగంగా నడిపిస్తున్నారు. పక్కా ప్రణాళిక వేసుకుని మే 28న రిలీజ్ పెట్టుకున్నారు. కానీ వైరస్ విజృంభిస్తుండటంతో బోయపాటి స్పీడుకు బ్రేకులు తప్పేలా లేవు. పరిస్థితులు చక్కబడే వరకు షూటింగ్ నిలిపివేయాలని బాలకృష్ణ తన బృందానికి సూచించినట్టు తెలుస్తోంది. అంటే ఈ కొన్నిరోజుల్లో చిత్రీకరణ నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ సైతం విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం :