బాలయ్య కోసం మరో డైరెక్టర్ ప్రయత్నం?

Published on Feb 15, 2022 7:02 am IST

డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్యకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో వాస్తవం ఎంత ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, బాలయ్య హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. డైరెక్టర్ ‘సంపత్ నంది’ను బాలయ్య దగ్గరకు పంపింది మిర్యాల రవీందర్ రెడ్డినే అని టాక్ నడుస్తోంది.

మరి బాలయ్య ఇమేజ్ కోసం సంపత్ నంది ఎలాంటి కథ రాశాడో చూడాలి. అన్నట్టు ఆ మధ్య సంపత్ నంది రవితేజతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, బాలయ్య అయితేనే తాను రాసుకున్న కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య సినిమాల పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :