‘తుంగభద్ర’ చూడనున్న బాలకృష్ణ

‘తుంగభద్ర’ చూడనున్న బాలకృష్ణ

Published on Mar 15, 2015 1:28 PM IST

balakrishna1
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరించిన సాయి కొర్రపాటితో, అతని బ్యానర్ వారాహి చలన చిత్రంతో బాలకృష్ణకి మధ్య హీరో నిర్మాతగానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అనుబంధం ఉంది. అందులో భాగంగానే సాయి కొర్రపాటి తీసే ప్రతి సినిమాని బాలకృష్ణ ప్రత్యేకంగా చూసి అభినందించడమే కాకుండా పబ్లిసిటీ విషయంలో తనవంతు సాయం కూడా చేస్తుంటాడు. ఎప్పటిలానే ఈ సారి కూడా బాలకృష్ణ సాయి కొర్రపాటి తదుపరి సినిమా ‘తుంగభద్ర’ని ముందుగానే చూడనున్నాడు.

మాకు అందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం నందమూరి బాలకృష్ణ ఈ రోజు ప్రత్యేకంగా ‘తుంగభద్ర’ సినిమాని చూడనున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 20న రిలీజ్ కానుంది. అదిత్ అరుణ్, డింపుల్ చోపడే జంటగా నటించిన ఈ సినిమాలో ఫేమస్ యాక్టర్ సత్యరాజ్ ఓ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ప్రతి సినిమాలానే సాయి కొర్రపాటి ఈ సినిమాతో గోగినేని శ్రీ‌నివాస కృష్ణని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈ సంవత్సరం సాయి కొర్రపాటి ఈ సినిమాతో సక్సెస్ ఖాతాని స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.

తాజా వార్తలు