బాలయ్య, వినాయక్ సినిమా లేటెస్ట్ న్యూస్ !

బాలయ్య కొత్త సినిమా ‘ఎన్టీఆర్’ రేపు ప్రారంభంకానుంది. తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ తరువాత వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో. సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మే 27 న ఈ మూవీ ప్రారంభం కానుంది. క‌న్న‌డ స్టార్ హీరో శివ రాజ్‌ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌ఫ్టీ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

కన్నడలో ఘన విజయం అందుకున్న ఈ చిత్రానికి రీమేక్ గా బాలయ్య, వినాయక్ ల సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో బాల‌య్య గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో కనిపించబోతున్నాడు. ఈ మూవీకి సంభందించిన పూర్తి క్లారిటి త్వరలో రానుంది. ‘ఇంటిలిజెంట్’ సినిమా తరువాత సి.కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Exit mobile version