ఇక బాలయ్య వరుసగా సినిమాలే !

ఇక బాలయ్య వరుసగా సినిమాలే !

Published on Nov 4, 2018 6:23 PM IST

వివి వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఫిబ్రవరి నెలలో వినాయక్ – బాలయ్య సినిమా మొదలవ్వనుందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో గతంలో ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం వచ్చింది. మళ్ళీ 16 ఏళ్ల తరవాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటం విశేషం.

ఇక ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉన్నారు. జనవరి మొదటివారానికి ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం బాలయ్య పూర్తి చేయనున్నారు. ఆ తరువాత వెంటనే బాలయ్య, వినాయక్ చిత్రానికి డేట్లు కేటాయించనున్నారు. అయితే ఇటు వినాయక్ చిత్రం చేస్తూనే.. అటు సమాంతరంగా బోయపాటి శ్రీనుతో కూడా బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం అందుతుంది.

మొత్తానికి బాలయ్య ఫిఫ్టీ ప్లస్ లో కూడా యంగ్ హీరోలు కంటే స్పీడుగా సినిమాలు చెయ్యడం, నిజంగా బాలయ్యకి నటన పై ఉన్న అంకితభావమే కారణమని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు