టాప్ 3లోకి చేరిపోయిన బాలయ్య

Published on Apr 29, 2021 8:00 pm IST

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ’ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. బాలయ్య గత చిత్రాలు ఏవీ క్రియేట్ చేయలేని సెన్సేషన్ ఈ సినిమా క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ పలు సినిమా యూట్యూబ్ రికార్డుల్ని అలవోకగా బీట్ చేస్తోంది. ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు, భీమ్ ఫర్ రామరాజు’ టీజర్లను క్రాస్ చేసింది. విడుదలై రెండు వారలు కూడ కాకముందే 50 మిలియన్ల వ్యూస్ సాధించి టాప్ 3 లో నిలిచింది.

54.5 మిలియన్ల వ్యూస్ నమోదుచేసి అల్లు అర్జున్ ‘పుష్ప’ మొదటి స్థానంలో ఉండగా 50.6 మిలియన్లతో ‘రామరాజు ఫర్ భీమ్’ రెండవ స్థానంలో ఉంది. చూడబోతే ఇంకో రెండు రోజుల్లో దీన్ని ‘అఖండ’ క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సినిమాకు ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రీరిలీజ్ బిజినెస్ కూడ బ్రహ్మాండంగా జరుగుతోంది. బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా విడుదల కూడ వాయిదాపడింది.

సంబంధిత సమాచారం :