అడవి బిడ్డ…పవర్ ఫుల్ గా “భగవంత్ కేసరి” ట్రైలర్!

అడవి బిడ్డ…పవర్ ఫుల్ గా “భగవంత్ కేసరి” ట్రైలర్!

Published on Oct 8, 2023 8:47 PM IST

bgava
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం ను అక్టోబర్ 19, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా మేకర్స్ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేయడం జరిగింది.

ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బాలకృష్ణ మరియు శ్రీ లీల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్ లో డైరెక్టర్ బాలకృష్ణ ను ఎలివేట్ చేసిన విధానం వేరే లెవెల్ లో ఉన్నాయి. ఒక పక్క జోవియల్ గా ట్రైలర్ సాగుతూనే ఉన్నా, విలన్ అర్జున్ రాంపాల్ కి చెమటలు పట్టించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. కాజల్ అగర్వాల్ సీన్స్ హీరో బాలయ్యను ఎలివేట్ చేస్తూ వేరే లెవెల్ లో ఉన్నాయి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలైట్ గా ఉంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు హరీశ్ పెద్ది లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు