నందమూరి బాలకృష్ణ హీరోగా నటించనున్న కొత్త సినిమా జూన్ 2న లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మొదటిసారి త్రిష బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించనుంది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని, అలాగే బాలకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం.
సత్యదేవ ఈ సినిమాకి డైరెక్టర్. స్వతహాగా సత్యదేవ బాలకృష్ణకి పెద్ద అభిమాని. దానివల్ల ఈ సినిమా కథ, ట్రీట్ మెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్ర నిర్మాత అయిన ఆర్. రమణారావు ఈ సినిమాని చాలా రిచ్ గా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే త్రిషకి భారీ పారితోషికం ఇచ్చి ఒప్పించారు.


