బాలయ్య – గోపీచంద్ మ‌లినేని సినిమా ఇంటర్వెల్ అదే !

Published on Jul 18, 2022 4:05 pm IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఇంటర్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వెల్ దగ్గరే బాలయ్య ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ ఓపెన్ అవుతుందని.. సినిమా మొత్తంలోన్ ఈ సిక్వెన్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో గత కొన్ని రోజులుగా రూమర్స్ ఎక్కువవుతున్నాయి. అయితే ఈ సినిమాని డిసెంబర్ 23వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న ఈ సినిమాతో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :