యధార్థ ఘటనలతో బాలకృష్ణ చిత్రం

Published on Apr 15, 2021 6:25 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే 28న విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం తర్వాత బాలయ్య గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘క్రాక్’ సినిమాతో గోపిచంద్ మలినేని ఇటీవలే సూపర్ హిట్ అందుకున్నారు.

ఆ సినిమాలో కూడ యాదార్థ ఘటనలను బేస్ చేసుకుని కొన్ని పాత్రలు, ఎపిసోడ్స్ రూపొందించారు గోపిచంద్ మలినేని. బాలయ్యతో చేయబోయే సినిమాను కూడ అలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగానే రూపొందించనున్నారట. అందుకోసం రీసెర్చ్ కూడ మొదలుపెట్టారు ఆయన. వేటపాలెంలో ఉన్న 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రంథాలయంలో ఈ రీసెర్చ్ చేస్తున్నారు గోపిచంద్ మలినేని. మరి ఆయన బాలయ్య కోసం ఏ చరిత్రను తవ్వుతున్నారు, ఏ యదార్థ గాథలను ఎంచుకున్నారో తెలియాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :