Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
‘వర్మ’ నుండి తప్పుకోవడానికి రీజన్ చెప్పిన స్టార్ డైరెక్టర్ !
Published on Feb 10, 2019 11:00 pm IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘వర్మ’ అని పేరు పెట్టింది చిత్రబృందం. అయితే ఇప్పటికే చిత్రం నుండి బాల స్వతహాగా తప్పుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ విషయం గురించి బాల మాట్లాడుతూ.. ‘‘వర్మ’ చిత్రం నుండి తప్పుకోవడానికి కారణం క్రియేటివ్‌ ఫ్రీడమ్‌ లేకపోవడమే. అందుకే నాకు నేను స్వతహాగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. ఇంతకీ మించి ఈ సినిమా గురించి ఏం మాట్లాడదల్చుకోలేదు. ధ్రువ్‌ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని ఇక్కడితో ఆపాలనుకుంటున్నాను’ అని బాల చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :