బాలయ్య -రవికుమార్ మూవీ లేటెస్ట్ అప్డేట్ !

Published on Apr 28, 2019 5:27 pm IST

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ తో తన నెక్స్ట్ మూవీ ని చేయనున్నాడు బాలయ్య. మే నుండి ఈ చిత్రంసెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ లో నటించనుండగా జగపతి బాబు విలన్ రోల్ లో కనిపించనున్నారట. ఇంతకుముందు జగపతి బాబు లెజెండ్ సినిమాలో విలన్ గా నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

మరి ఈ సారి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి. ఇక బాలయ్య -కె ఎస్ రవి కుమార్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘జై సింహా’ డీసెంట్ హిట్ అనిపించుకుంది.

సంబంధిత సమాచారం :