క్లైమాక్స్ హంట్ లో బాలయ్య “అఖండ”.!

Published on Jul 1, 2021 10:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా “అఖండ” అనే భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ అండ్ ఎమోషనల్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను బాలయ్య తో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో ఎనలేని అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం కూడా ఇటీవలే లాక్ డౌన్ 2.0 అనంతరం ఇటీవలే మొదలయ్యింది.

అయితే ఒక మూడు వారాలు అలా ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ ఒక్క క్లైమాక్స్ పార్ట్ మినహా మొత్తం కంప్లీట్ అయ్యిపోయిందట. మరి ఇప్పుడు బోయపాటి ఆ సాలిడ్ క్లైమాక్స్ సీక్వెన్స్ కోసమే ఇప్పుడు హంట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ లో పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న బోయపాటి ఏదోకటి ఫిక్స్ చేసి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేయనున్నారట. మరి దీనిపై ఇంకా సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :