బాలయ్య కూడా అప్పటి నుంచే రెడీ కానున్నారట.!

Published on Jun 19, 2021 1:01 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్లాన్ చేసిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ లాక్ డౌన్ మూలాన షూటింగులు నిలిచిపోయిన ఎన్నో చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

మరి ఇప్పటికే చాలా మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెల రోజుల లోపే షూట్ ను బ్యాలన్స్ ఉంచుకుంది. మరి ఎట్టకేలకు ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. మన టాలీవుడ్ లో ఇప్పటికే పలు ప్రముఖ సినిమాలు అన్ని వచ్చే జూలై మొదటి వారం నుంచే ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

మరి ఆ చిత్రాలతో పాటుగా బాలయ్య కూడా జూలై మొదటి వారం నుంచే ఈ చిత్రాన్ని రీస్టార్ట్ చెయ్యాలని చూస్తున్నారట. ఇక ఈ మాస్ ప్రాజెక్ట్ లో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :