బడ్జెట్ తగ్గించటానికి బోయపాటి మార్పులు !

Published on May 3, 2019 10:55 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకుడిగా అనుకున్న సినిమా పోస్ట్ ఫోన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పోస్ట్ ఫోన్ అవ్వడానికి కారణం హై బడ్జెట్ అని సినిమాకు మొత్తం బోయపాటి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 60 కోట్లు అని కొన్ని రోజులు క్రితం వార్తలు వచ్చాయి. బడ్జెట్ మరి ఎక్కువ అయితే రిస్క్ అనే ఉద్దేశ్యంతో.. ఈ కథ పక్కన పెట్టి, 40 కోట్లల్లో వేరే కథ ఏదైనా చెయ్యమని బాలయ్య బోయపాటికి సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం బోయపాటి తయారు చేసిన కథ చాలా బాగుందట. సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. అందుకే కథ మార్చకుండా కథలో మార్పులు చేసి బడ్జెట్ తగ్గించటానికి బోయపాటి స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో చూడాలి. హిట్ అయితే మాత్రం వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం :

More