11 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య “సింహా” గర్జన.!

Published on Apr 30, 2021 7:30 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు చేస్తున్న చిత్రం “అఖండ”. అయితే ఈ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది అని అందరికీ తెలిసిందే. అయితే ఈ సెన్సేషనల్ కాంబోలో మొదటగా వచ్చిన పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా “సింహా” సినిమాను అయితే నందమూరి అభిమానులు కానీ పక్కా మాస్ సినిమాల అభిమానులు కానీ అంత సులువుగా మర్చిపోలేరు.

అంతకు ముందు కొన్నాళ్ల వరకు బాలయ్య మాస్ ఇమేజ్ కి తగ్గ పవర్ సబ్జెక్టు కానీ బ్రేక్ కానీ తగల్లేదు. అప్పుడు 2010లో వచ్చింది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “సింహా”. సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే బాలయ్య మరియు బోయపాటి శ్రీనులా కాంబో బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపేసింది.

అప్పటి వరకు బాలయ్యలో చూడని కొత్త ఎనర్జీ పరిచయం చెయ్యడంతో ఆ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలిచింది. అంటే ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ అప్పట్లో నమోదు చేసిందో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సినిమా వచ్చి 11 ఏళ్ళు నేటితో పూర్తి కావడంతో మరోసారి అప్పటి రోజులు రికార్డులు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :