బాలయ్య, బోయపాటి టీం స్పీడ్ పెంచాల్సిందేనా.?

Published on Apr 9, 2021 12:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటై శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అండ్ హ్యాట్రిక్ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఎప్పుడో స్టార్ట్ కాబడిన ఈ చిత్రం అలా షూట్ ను జరుపుకుంటూ వస్తుంది. అయితే వచ్చే మే నెల లోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈ చిత్ర యూనిట్ నుంచి అప్పటి నుంచి మరో అప్డేట్ రాలేదు.

అయితే ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి అనుకున్నా ఇంకా టైటిల్ పై కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడం ఈ చిత్రంపై మరింత సస్పెన్స్ రేపింది. అప్పుడు శివరాత్రి సందర్భంగా టైటిల్ వస్తుంది అని బజ్ వచ్చింది. కానీ మిస్సయ్యింది ఇప్పుడు ఉగాదికి రావచ్చని మళ్ళీ బజ్ వచ్చినా ఇంకా చిత్ర యూనిట్ నుంచి మాత్రం అప్డేట్స్ పరంగా ఎలాంటి కదలిక లేదు.

సో ఇప్పుడు మారుతున్న కరోనా పరిస్థితుల రీత్యా సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారా అందుకే అప్డేట్స్ పరంగా ఎలాంటి స్పీడ్ కనబర్చట్లేదు అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే చిరు నటిస్తున్న ”ఆచార్య” అదే నెలలో విడుదలకు సిద్ధంగా ఉండడంతో పాటలు కూడా లాంచ్ చేస్తున్నారు. మరి బాలయ్య బోయపాటి టీం స్పీడ్ పెంచాల్సిందే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :