లేటెస్ట్..బాలయ్య పవర్ఫుల్ కాంబో అప్డేట్ వచ్చేసింది.!

Published on Jun 10, 2021 9:00 am IST

నేడు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా అభిమానులు సహా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ విషెష్ తెలియజేస్తున్నారు. అయితే మరి ఇదే రోజున బాలయ్య ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ ఇస్తున్నట్టుగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో ఆ అప్డేట్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఆ అప్డేట్ ను ఇచ్చేసారు.

ఒక పవర్ ఫుల్ పోస్టర్ తో సింహాన్ని చూపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య కాంబోలో సినిమా ప్రెజెంట్ చేస్తుండడం ఆనందంగా ఉందని తెలియజేసారు. అలాగే ఈ చిత్రానికి కూడా మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నది కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ వేట కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది అని షూట్ పై అప్డేట్ ఇచ్చి బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. మరి ఈ సెన్సేషనల్ కాంబో ఎప్పుడు స్టార్ట్ కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :