బాలయ్య లేటైనా భారీ సాయం చేశారు.

Published on Apr 3, 2020 5:03 pm IST


నటసింహం బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఏకంగా 1.25 కోట్ల సాయం చేశారు.ఏపీ మరియు తెలంగాణా ప్రభుత్వాలకు చెరో 50లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసిన బాలయ్య, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 25లక్షల రూపాయల సాయం అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా చిత్ర పరిశ్రమ పూర్తిగా మూత పడింది. థియేటర్లు బంద్ చేయడంతో పాటు, కొత్త చిత్రాలు విడుదల, మరియు షూటింగ్స్ నిలిపివేశారు. దీనితో పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది రోజు వారి కూలీలు ఉపాధి కోల్పోయారు. వీరి సహాయార్ధం టాలీవుడ్ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తుండగా బాలకృష్ణ నేడు ఈ మొత్తం ఇవ్వడం జరిగింది.

దీనికి సంబంధించిన చెక్కుని బాలకృష్ణ సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ కి అందజేశారు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బోయపాటిశ్రీను తెరకెక్కిస్తున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపిస్తారని టాక్. అలాగే అందులో ఓ లుక్ నందు ఆయన అఘోరాగా కనిపిస్తారని తెలుస్తుంది. ఈ మూవీని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More