మరోమారు ఉన్నతమైన మనసు చాటుకున్న బాలయ్య.!

Published on May 21, 2021 1:09 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి కాంబోలో “అఖండ” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు కోవిడ్ రెండో వేవ్ మూలాన అందాకా షూట్ వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ లో బాలయ్య పలు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.

ఆ మధ్యనే అనేక మంది కరోనా రోగులకు అండగా 20 లక్షలు విలువ చేసే మెడికల్ సదుపాయాలను అరేంజ్ చేసి తన ఉన్నతమైన మనసును చాటుకున్నారు. మరి అలాగే మళ్ళీ తాజాగా తీసుకున్న మూవ్ తో బాలయ్య అభిమానులు మరోమారు గర్వపడుతున్నారు. ఇటీవల బాలయ్య ఇబ్బందులు పడుతున్న కరోనా రోగుల కోసం తన గెస్ట్ హౌస్ ను కేటాయించినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :