అరెరె.. ఒక ప్లాప్ కే రేంజ్ మారిపోయిందే !

Published on Apr 28, 2019 6:30 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా అనుకున్న సినిమా పోస్ట్ ఫోన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పోస్ట్ ఫోన్ అవ్వడానికి కారణం హై బడ్జెట్ అంటా. సినిమాకు మొత్తం బోయపాటి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 60 కోట్లు. బోయపాటి గత సినిమా పరాజయం అవ్వడం, అలాగే ఇటు ఎన్.బి.కే ఫీల్మ్స్ లో నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్స్ ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోవడం.. వంటి పరిస్థితుల్లో బడ్జెట్ మరి ఎక్కువ అయితే రిస్క్ అనే ఉద్దేశ్యంతో.. కథలో మార్పులు చేసి, బడ్జెట్ తగ్గించమని లేదా 40 కోట్లల్లో వేరే కథ ఏదైనా చెయ్యమని బాలయ్య బోయపాటికి సూచించినట్లు తెలుస్తోంది.

అందుకే సినిమా పోస్ట్ ఫోన్ అయిందట. అయితే బోయపాటి తయారుచేసిన కథ చాలా బాగుందట. సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. అందుకే కథ మార్చకుండా కథలో మార్పులు చేసి బడ్జెట్ తగ్గించే ఆలోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఒక ప్లాప్ ఇచ్చినందుకు బోయపాటి రేంజ్ మారిపోయిందనే చెప్పాలి.

మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఈ సారి హిట్ అవుతుందో లేదో చూడాలి. అయితే ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే.

సంబంధిత సమాచారం :