సింహా, లెజెండ్ చిత్రాల్లో లాగానే.. !

Published on Feb 10, 2019 6:49 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ నెల మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారట. సింహా, లెజెండ్ చిత్రాల్లో లాగానే రెండు తరాల చెందిన పాత్రల్లో బాలయ్య కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాలో రాజకీయ అంశాలు ఉంటాయని ఆ మధ్య సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండవట. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలచాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More