ఆహ్లాదంగా పుట్టినరోజు జరుపుకున్న బాలయ్య.!

Published on Jun 10, 2021 4:00 pm IST

ఈరోజు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ జన్మదినం కావున నిన్నటి నుంచే తన చిత్రం “అఖండ” నుంచి అప్డేట్ తో ముందే మొదలయ్యి ఈరోజు ఉందయం నుంచి జాతీయస్థాయి శుభాకాంక్షలుతో అందరి ప్రేమను బాలయ్య కైగొంటున్నారు. మరి అసలు బాలయ్య తన జన్మదిన వేడుకలు ఎలా జరుపుకున్నారో ఇపుడు బయటకి వచ్చింది.

తాను స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అక్కడి హాస్పిటల్ సిబ్బందితోని మరియు అక్కడి చిన్నారుల నడుమ ఒక రకమైన ఆహ్లాదకర వాతావరణంలో తన తల్లిదండ్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, బసవతారకం గారి ఆశీస్సులతో బాలయ్య తన జన్మదిన వేడుకలు జరుపుకున్నానని తెలియజేసారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం :