గోపీచంద్ ఆడియోకి బాలయ్య చీఫ్ గెస్ట్

గోపీచంద్ ఆడియోకి బాలయ్య చీఫ్ గెస్ట్

Published on Dec 2, 2015 10:14 AM IST

balakrishna-soukyam
వరుస హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న మాచో హీరో గోపీచంద్ తనకి ‘యజ్ఞం’ రూపంలో మొదటి హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరితో కలిసి చేస్తున్న మరో సినిమా ‘సౌఖ్యం’. ఇటీవలే గోపీచంద్ – శ్వేత భరద్వాజ్ లపై షూట్ చేసిన ఐటమ్ సాంగ్ తో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్న ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.

అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియోని డిసెంబర్ 13న ఒంగోలులో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ ఈ సినిమా ఆడియోకి ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. ఎఎస్ రవికుమార్ చౌదరి మరియు రచయితలైన కోన వెంకట్ – గోపి మోహన్ లు బాలయ్య బాగా తెలియడమే కాకుండా వారితో సినిమాలు కూడా చేసాడు. అందుకే వారు అడగగానే వస్తానని బాలయ్య మాటిచ్చాడు. రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు