“అఖండ”తో వండర్స్ నమోదు చేస్తున్న బాలయ్య.!

Published on Apr 21, 2021 11:01 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం “అఖండ”. తన ఆల్ టైం మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రం అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వస్తుంది. మరి ఇటీవలే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం నుంచి టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన టీజర్ మాత్రం దుమ్ము లేపుతుంది అని చెప్పాలి.

లేటెస్ట్ గా 30 మిలియన్ వ్యూస్ మార్క్ చేసి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గానే కాకుండా దక్షిణాదిలో మన సీనియర్ స్టార్ హీరోస్ లో అయితే అత్యధిక వ్యూస్ రాబట్టిన రజినీ కబాలి, కాలా టీజర్స్ తర్వాత 30 మిలియన్ మార్క్ రేస్ లో ఒక్క బాలయ్యది మాత్రమే ఉంది. దీనిని బట్టి అఖండ మాస్ సెన్సేషన్ ఏ లెవెల్లోకి వెళ్లిందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :