“అఖండ”లో బాలయ్య ఎంట్రీ మామూలుగా ఉండదట.!

Published on Apr 17, 2021 3:00 pm IST


నందమూరి నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. దీనికి ముందు వచ్చిన “సింహా” “లెజెండ్” లకు మించిన స్థాయి అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి. పక్కాగా యాక్షన్ మరియు నందమూరి అభిమానులకు పండుగలా ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నట్టుగా లేటెస్ట్ టైటిల్ రోర్ చూస్తే ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చేసింది.

ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్ పవన్ సినిమా “వకీల్ సాబ్”లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూలో “అఖండ”పై చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొన్న టీజర్ వచ్చింది ఏమో కానీ ఈ చిత్రంలో బాలయ్య పై ఫైట్స్ కానీ తన ఎంట్రీ కానీ మరో లెవెల్లో ఉంటాయని బోయపాటి శ్రీను గత సింహా, లెజెండ్ సినిమాలకు నాలుగింతలు ఎక్కువ స్థాయిలో వాటిని డిజైన్ చేసారని తెలిపారు.

మరి దీనిని బట్టి అఖండ ప్రభంజనం ఏ స్థాయిలో ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :