మోక్షజ్ఞ ఎంట్రీ 2021?

Published on Aug 8, 2020 12:51 am IST


నందమూరి అభిమానుల అతి పెద్ద కోరిక మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ. జై బాలయ్య అంటూ ఆరాధించే తమ హీరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల క్రితమే మోక్షజ్ఞకు హీరోగా మారే వయసొచ్చింది. ఐతే ఆయన మనసు మాత్రం సినిమా వైపు మళ్లడం లేదు. హీరో కావడానికి తపస్సు చేసే వారున్న ఈ రోజుల్లో మోక్షజ్ఞ కు ఫ్రీ పాస్ ఉన్నా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయంలో బాలయ్యపై నందమూరి అభిమానాలు ఒత్తిడి పెంచేస్తున్నారు. మోక్షజ్ఞను ఒప్పించాలని గట్టిగా కోరుకుంటున్నారు.

ఐతే ప్రస్తుతం షూటింగ్స్ కి విరామం కావడంతో బాలయ్య ఈ విషయంపై దృష్టిపెట్టారట. మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నాడట. మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ కోసం అద్భుత కథను వెతికే పనిలో ఉన్నారట. 2021 లో మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేయాలనేది బాలయ్య టార్గెట్ గా తెలుస్తుంది. బాలయ్య అనుకున్నట్లు జరిగితే స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా మరో యువరత్నం దిగుతుంది.

సంబంధిత సమాచారం :

More