బాలయ్య ‘ఫిల్మ్ స్టూడియో’ నిర్మాణానికి కసరత్తులు !

బాలయ్య ‘ఫిల్మ్ స్టూడియో’ నిర్మాణానికి కసరత్తులు !

Published on Sep 25, 2018 5:27 PM IST

నందమూరి బాలకృష్ణ నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా సినీనిర్మాణం జరగాలనే ఉద్దేశ్యంతో వైజాగ్ లో ఫిల్మ్ సిటీ కట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే వైజాగ్ లోని భీమిలి రోడ్డు ప్రాంతంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 316 ఎకరాల్లో ఫిల్మ్ సిటీస్ కట్టేందకుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది. ఇందుకుగాను ఎకరం 50 లక్షలుగా కేటాయించిందని, ఈ రేటు తగ్గించే సూచనలు కూడా ఉన్నాయని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టెలివిజన్, థియేటర్ అభివృద్ది సంస్థ అధ్యక్షుడు అంబికా క్రిష్ణ తెలిపారు. అలాగే బాలయ్య ఫిల్మ్ సిటీ నిర్మాణం చేపట్టనున్నారని కూడా ఆయనే వెల్లడించారు.

అయితే బాలకృష్ణ వచ్చే ఏడాదిలో ఎలెక్షన్స్ ముగిశాక, వైజాగ్ లోని భీమిలి రోడ్డు ప్రాంతంలో ఫిల్మ్ స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ స్టూడియోకి సంబంధించిన ఫుల్ డేటాని కలెక్ట్ చేసి, పరిశీలించమని.. బాలయ్య తన ఎన్.బి.కె నిర్మాణ సంస్థలోని కొంతమందిని పురమాయించారట. అయితే బాలయ్య ఫిల్మ్ స్టూడియోతో పాటు, అమరావతిలో ‘బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్’ కూడా నిర్మించనున్నారు. హాస్పిటల్ నిర్మాణ పనులను మాత్రం సాధ్యమైనంత త్వరలోనే చేపట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు