థాయిలాండ్ లో మొదలెట్టిన బాలయ్య…!

Published on Aug 10, 2019 7:38 pm IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ థాయ్‌లాండ్‌లో ఈరోజు నుండి ప్రారంభమైంది. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్‌లోకీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలోని నటీనటులందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. జైసింహా వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత బాలక‌ృష్ణ, సి.కల్యాణ్ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంతన్ భట్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. పరుచూరి మురళి కథను అందిస్తున్నారు.

బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, వేదిక, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, జయసుధ, షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, కోటేశ్వర్ రావ్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్, బండ రఘు తదితరులు ఇతర ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :