యాక్షన్ తో పాటు ఎమోషనూ పీక్స్ లో ఉంటుందట !

Published on Apr 26, 2021 8:53 am IST

బాలయ్య బాబు ప్రస్తుతం ‘మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే వీరి సినిమా ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా సాగనుంది, అసలు బోయపాటి – బాలయ్య కలయికలో సినిమా అంటేనే.. అదొక బీభత్సమైన యాక్షన్ డ్రామాగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే… ముఖ్యంగా తమ కాంబినేషన్ కు ఉన్న మార్క్ చెడిపోకుండా.. పైగా ఒక కొత్త మార్క్ ను అందుకోవటానికి ప్రయత్నిస్తూ.. బోయపాటి ఈ సినిమాని మలిస్తున్నాడట

ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్స్ అండ్ ఫుల్ యాక్షన్ తో సాగే ఫైట్ సీన్స్ తో అభిమానులను ఫుల్ గా అలరించడం ఖాయం అని.. అలాగే ఈ సారి అద్భుతమైన ఎమోషన్ తో వెరీ ఎమోషనల్ గానూ బాలయ్య సినిమా చాలా వైవిధ్యంగానూ ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :