బాలయ్య సినిమా షూటింగ్ అప్ డేట్ !

బాలయ్య సినిమా షూటింగ్ అప్ డేట్ !

Published on Oct 26, 2020 12:00 AM IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న యాక్షన్ సినిమా షూటింగ్ అన్ని జాగ్రత్తలతో రేపు హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను నవంబర్ 19వ తేదీ వరకూ షూట్ చేస్తారట. ఇక ఆ తరువాత నుంచి ఈ చిత్రంలోని సాంగ్స్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట.

ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోంది. కాగా ఆ మధ్య ఒక నిమిషానికి పైగా వచ్చిన ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా పంచ కట్టులో బాలయ్య లుక్ కేకగా ఉంది. వైట్ అండ్ వైట్ లో బాలయ్య చక్కగా సరిపోయారు. సినిమాలో కూడా బాలయ్య అదే లుక్ తో కనిపిస్తారట.

కాగా బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి సూపర్ విజయాలను అందించారు బోయపాటి. కాబట్టి ఈసారి కూడా సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు