నేషనల్ వైడ్ ట్రెండ్స్ లో బాలయ్య బర్త్ డే విషెష్.!

Published on Jun 10, 2021 7:59 am IST

మొదటగా తెలుగు చలన చిత్ర నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. నేడు నందమూరి అందగాడు, విలక్షణ నటుడు, ఎంతటి, ఎలాంటి డైలాగ్ ని అయినా అత్యద్భుతంగా పలికించగల పదజాల ప్రావీణ్యుడు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో అభిమానుల్లో సంబరాలు ఒక లెక్కలో జరుగుతున్నాయి.

ఓ పక్క సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తుండడంతో పాటుగా బయట కూడా కోవిడ్ నిబంధనలతో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా అనేక మంది తెల్లవారు నుంచే బాలయ్యకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తుండడంతో బాలయ్య పేరు ఇపుడు నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నది.

అలాగే నిన్ననే బాలయ్య నటిస్తున్న భారీ చిత్రం “అఖండ” సరికొత్త పోస్టర్ తో ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇప్పుడు రానున్న సరికొత్త సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి బాలయ్య మరిన్ని ఇలాంటి జన్మదిన జరుపుకోవాలని, మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలను తెలుగు తెలుగు ఆడియెన్స్ కి అందివ్వాలని మరింత ఎనర్జీతో వీక్షకులను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తూ మా 123తెలుగు యూనిట్ వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం :